Tuesday, February 25, 2020

Mera kuch saamaan tumhare paas padaa hai in Telugu

I've tried the impossible. I've tried to translate Gulzar saab's "Mera kuch saamaan" in telugu. I know it's too much of an adventure but how long can I carry this flame in my heart? Like how favorite character Shrek puts it- Better out than in. So here it is, "Mera kuch saamaan tumhare paas padaa hai" from Ijaazat. నా సామాను కొంత నీ దగ్గర ఉండిపోయింది. నా సామాను కొంత నీ దగ్గర ఉండిపోయింది. తడిసిన వర్షాకాలపు రోజులు కొన్ని ఉండిపోయాయి ఒక ఉత్తరం మడతల మధ్యలో మనిద్దరి రాత్రి ఒకటి ఉండిపోయింది ఆ రాత్రిని ఆర్పెయ్యి. నా సామాను తిరిగి నాకు ఇచ్చెయ్యి. కొన్ని వసంతాలు. కదా? వసంతఋతువులో రాలుతున్న ఆకుల సవ్వడి నా చెవి లోలాకులుగా తగిలించుకుని తిరిగి ఇచ్చేసిన ఆ సవ్వడి ఆకులు రాలిన ఆ కొమ్మ ఇంకా వణుకుతూనే ఉంది గాలికి ఆ కొమ్మని తుంచెయ్యి. నా సామాను తిరిగి నాకిచ్చేయి. ఒకే గొడుగు కింద వర్షంలో నువ్వూ నేనూ సగం పొడిగా సగం తడిగా తడవని సగాన్ని నేను తెచ్చేసుకున్నాను తడిసిన నా మనసుని మాత్రం మన పరుపు పక్కనే మర్చిపోయానేమో అది పంపించేయి నా సామాను తిరిగి నాకు ఇచ్చేయి నూటపదహారు వెన్నెల రాత్రులు నీ బుజం మీది ఆ పుట్టుమచ్చ ఆరీ ఆరని గోరింటాకు వాసన కావాలని నీతో పెట్టుకున్న గిల్లికజ్జాలు నీకు గుర్తున్నాయో లేదో ఆ అబధ్ధపు వాగ్ధానాలు అన్నీ పంపించేయి. నా సామాను తిరిగి నాకిచ్చేయి. ఇవన్నీ సమాధి చేసేసాక నువ్వు అనుమతి ఇస్తే... నేనూ వాటితోపాటే శాశ్వతంగా నిద్రపోతాను నేనూ వాటితోపాటే శాశ్వతంగా నిద్రపోతాను